సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్

by Gugulothu.Kavitha |

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’(Coolie).

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’(Coolie). లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే (Pooja Hegde)స్టెప్పులేయనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. కాగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం, అమెరికాలో కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అక్కడ రజినీకాంత్ ఫ్యాన్స్ ఫస్ట్ డే షో కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ స్క్రీన్ కౌంట్‌తో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Link

Next Story