- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: సల్మాన్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. బిగ్ సర్‌ప్రైజ్ రాబోతుందంటూ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. 2023లో సల్మాన్ నటించి రెండు చిత్రాలు భారీ డిజాస్టర్‌గా నిలవడంతో అచీ తూచి కథలు ఎంచుకుంటున్నారు. ఒక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సికందర్’(Sikander). ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తుండగా.. సాజిద్ నడియాద్‌వాలా(Sajid Nadiadwala) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), సత్యరాజ్(Satyaraj) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఇప్పటికే ‘సికందర్’ నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచిన విషయం తెలిసిందే. అలాగే ఈద్‌కి విడుదల కాబోతుందని చెప్పారు కానీ.. డేట్ అనౌన్స్ చేయలేదు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘సికందర్’ నుంచి సల్మాన్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ నెల 27న ఈ చిత్రానికి సంబంధించిన ఓ సర్‌ప్రైజ్ కూడా రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సల్మాన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ‘సికందర్’ నుంచి టీజర్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






