- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అప్‌కమింగ్ మూవీస్‌లో స్పిరిట్(Spirit) ఒకటి. దీనిని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అప్‌కమింగ్ మూవీస్‌లో స్పిరిట్(Spirit) ఒకటి. దీనిని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి డైరెక్టర్ సందీప్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. కింగ్‌డమ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'స్పిరిట్' సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో ప్రారంభమవుతుందని తెలిపారు. నాన్టాప్ షూటింగ్ చేసి సినిమాను పూర్తిచేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాజా సాబ్ ఆల్రెడీ చివరిదశకు వచ్చేసింది.. ఫౌజీ షూట్ కూడా సగానికి పైగా పూర్తైంది. ఈ రెండింటి తర్వాత వీలైనంత త్వరగా స్పిరిట్‌ను పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు సందీప్ వంగా. ఈ సినిమా కోసం ప్రభాస్ 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. 2026 సెకండాఫ్‌లో స్పిరిట్ విడుదల కానుంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.






