- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘OG’ సినిమా నుంచి సూపర్ అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). అయితే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ స్టార్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని రూ. 250 కోట్లు భారీ బడ్జెట్‌తో తీసుకురాబోతుండటంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. పవన్ క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించునన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా.. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్(Arjun Das), ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దీనిని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. కానీ ‘ఓజీ ’షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పూర్తిగా సినిమా షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చారు. ఇక పవన్ అభిమానులు మాత్రం ‘ఓజీ’ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘ఓజీ’ మూవీకి సంబంధించిన ఓ సూపర్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. మే-జూన్ నెలల్లో 25 రోజుల షెడ్యూల్‌తో షూటింగ్‌ను ముగించాలని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను సెప్టెంబర్‌లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది తెలుసుకున్న పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.






