‘హమ్మయ్య.. ఎట్టకేలకు ఆరోజు రానే వచ్చేసింది’.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి!

by Gantepaka Srikanth |

హరిహర వీరమల్లు(Harihara Veeramallu).. ఇది పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. అప్పుడెప్పుడో 2020లో ప్రారంభించారు.

‘హమ్మయ్య.. ఎట్టకేలకు ఆరోజు రానే వచ్చేసింది’.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: హరిహర వీరమల్లు(Harihara Veeramallu).. ఇది పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా. అప్పుడెప్పుడో 2020లో ప్రారంభించారు. మొదట ఈ సినిమాను 2022 జనవరిలో సంక్రాంతికి వస్తుందని ప్రక‌టించారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29వ తేదీకి వస్తుందన్నారు.. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు అనేకసార్లు వాయిదా పడింది. చివరకు 2025 మార్చిలో వస్తుందని.. ఇక మరోసారి వాయిదా పడదని ప్రకటించారు.. కానీ రిలీజ్ కాలేదు. చివరగా మే 9వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ ఉంటుందని నిర్మాత, దర్శకుడితో పాటు చిత్రబృందం మొత్తం ముక్తకంఠంతో ప్రకటించింది. చివరకు ఇది కూడా ఫైనల్ అయ్యేలా కనిపించడం లేదు. చిత్రబృందం ప్రకటించిన తేదీకి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన కొన్ని సీన్ల షూటింగ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే మరో నెల రోజులు ఆగకతప్పదేమో అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడి నిరాశ చెందుతున్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్‌కు వచ్చేదెప్పుడు.. ఆ సినిమా పూర్తయ్యేదెప్పుడు? అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

అయితే.. నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎట్టకేలకు రేపు(ఆదివారం) హరిహర వీరమల్లు షూటింగ్‌కు పవన్ కల్యాణ్ హాజరు కాబోతున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తనకు సంబంధించిన సీన్లు మొత్తం పూర్తి చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్‌, బాబీ డియోల్, నిధి అగర్వాల్‌(Nidhi Agarwal), నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది.

Next Story