- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HHVM: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు(HariHara Veeramallu). షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు(HariHara Veeramallu). షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ప్రక్రియ పూర్తి కాగా, సెకండాఫ్ ఎడిటింగ్ మాత్రమే మిగిలి ఉందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అనుకున్న సమయానికి(మార్చి 28) సినిమాను విడుదల చేసేందుకు అటు దర్శకుడు, ఇటు నిర్మాత రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరోవైపు.. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన మాట వినాలి సాంగ్(Maata Vinali Song) ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాటను స్వయంగా పవన్ కల్యాణే ఐదు భాషల్లో పాడి అదరగొట్టారు. తాజాగా.. ఇద్దరు హీరోయిన్లతో స్టెప్పులేసిన సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సగం భాగానికి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించగా.. మిగిలిన పార్ట్‌ను నిర్మాత ఏఎమ్ రత్నం(AM Ratnam) కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ అందిస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






