- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నా భయ్యా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. పెద్దిలో మీర్జాపూర్ ఫార్ములా
మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో దివ్యేందు శర్మ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పిన వ్యక్తే, ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో దివ్యేందు శర్మ ఒకరు. ఈ సిరీస్‌కు ముందు ఆయనకు పెద్దగా గుర్తింపు లేకపోయినా, మిర్జాపూర్ తర్వాత విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో ఆయన పోషించిన మున్నా భయ్యా పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో దివ్యేందుకి “మున్నా భయ్యా”గానే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌లో ఆయన తెలుగు డబ్బింగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం దివ్యేందు శర్మ, రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
దీంతో మిర్జాపూర్ లో దివ్యేందుకు డబ్బింగ్ చెప్పిన వ్యక్తే ఈ సినిమాలో కూడా వాయిస్ ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. లేదంటే తెలుగు ప్రేక్షకులు పాత్రతో కొంత డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది చిత్రంలో దివ్యేందు శర్మ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిర్జాపూర్ లో మున్నా భయ్యా పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పిన వ్యక్తే ఈ సినిమాకూ వాయిస్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మున్నా భయ్యా తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పెద్ది చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






