సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈవారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఇవే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-18 09:19:21  IST  )

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈవారం ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ రాబోతున్న సినిమాలు, మరి వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..

నెట్‌ఫ్లిక్స్:

వీర్ దాస్: పూల్ వాల్యూమ్(ఇంగ్లీష్)- జూలై 18

డెలిరియమ్(ఇంగ్లీష్)- జూలై 18

వాల్ టు వాల్(కొరియన్)- జూలై 18

ఐయామ్ స్టిల్ ఏ సూపర్ స్టార్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 18

పడ్డింగ్టన్ ఇన్ పేరు(ఇంగ్లీష్)-జూలై 18

జియో హాట్‌స్టార్:

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2(తెలుగు డబ్బింగ్)- జూలై 18

స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్ సీజన్ 3(ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 18

జీ5 ఓటీటీ:

భైరవం(తెలుగు)- జూలై 18

ది భూత్నీ(హిందీ)- జూలై 18

సత్తమమ్ నీదియుమ్(తమిళ వెబ్ సిరీస్)- జూలై 18

అమెజాన్ ప్రైమ్:

కుబేర(తెలుగు)- జూలై 18

Next Story