సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవే..

by Gugulothu.Kavitha |

సౌత్ ఆడియన్స్‌కు సినిమాలంటే పిచ్చి.

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు ఇవే..
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆడియన్స్‌కు సినిమాలంటే పిచ్చి. ఇక తెలుగు ప్రేక్షకులకు అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు తన అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే సందడి సందడి చేస్తారు. అయితే ప్రతి నెల కొత్త కొత్త చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో జూన్ మంత్‌లో కూడా కొన్ని న్యూ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో.. వాటి డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

థగ్ లైఫ్:

కమల్ హాసన్, త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన సినిమా థగ్ లైఫ్. లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదల అవుతోంది.

హరిహర వీరమల్లు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu). ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక దీనికి దర్శకులు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం(AM Ratnam) నిర్మాణం వహించారు. కాగా ఈ మూవీ జూన్ 12న గ్రాండ్‌గా రిలీజ్‌కి రాబోతుంది.

8 వసంతాలు:

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు'. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. ఇక నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

కుబేర:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

కన్నప్ప:

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(‘Kannappa’). ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది.

మార్గన్:

త‌మిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం మార్గన్ (Maargan). ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా విజయ్ ఆంటోనీ(Vijay Antony) ఫిలింస్ కార్పొరేషన్ బ్యాన‌ర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రం జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Next Story