- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 'మా ఇంటి బంగారం' టికెట్లు
'మా ఇంటి బంగారం' చిత్రాన్ని ఈరోజు నుంచి సింగిల్ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.180కే సినిమా వీక్షించే అవకాశం కల్పించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే భారీ వసూళ్లను రాబట్టి, తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఫీమేల్ లీడ్ చిత్రంగా నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తి కావడంతో ప్రేక్షకులను మరింతగా ఆకర్షించేందుకు చిత్ర బృందం టికెట్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.
ఈరోజు నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.105గా, మల్టీప్లెక్స్‌లలో రూ.180గా నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇప్పటికే మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, తగ్గిన టికెట్ ధరలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, దిగంత్ మంచాలే కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.






