మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. షాకింగ్ వీడియోతో ‘మెగా-158’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్

by Mallepaka Hamsa |

ప్రతి రోజూ మన పరిధులను అధిగమించడానికి లభించే మరో అవకాశం.

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. షాకింగ్ వీడియోతో ‘మెగా-158’ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘మెగా-158’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడంతో, ఆ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. మెగాస్టార్ చిరంజీవి.. తాను జిమ్‌లో సరికొత్త లుక్ కోసం కష్టపడుతున్న ఒక పవర్‌ఫుల్ వీడియోను షేర్ చేస్తూ.. "ప్రతి రోజూ మన పరిధులను అధిగమించడానికి లభించే మరో అవకాశం... నా ప్రియ మిత్రుడు బాబీతో కలిసి ‘మెగా-158’ ద్వారా మరో ఎప్పటికీ గుర్తుండిపోయే సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి, పూర్తి ఉత్సాహంతో, ఉద్వేగంతో సిద్ధంగా ఉన్నాను. ప్రారంభోత్సవ వేడుక మే 21న జరనుందని చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.



Next Story