Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి రీ రిలీజ్ కాబోతున్న గ్లోబల్ స్టార్ మూవీ

by Hamsa |
Ram Charan: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి రీ రిలీజ్ కాబోతున్న గ్లోబల్ స్టార్ మూవీ
X

దిశ, సినిమా: ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు లేదా ఏదైనా స్పెషల్ డేస్ సందర్భంగా సినిమాలను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చిత్రాలు మొదట డిజాస్టర్ అయినప్పటికీ రీరిలీజ్‌లో మాత్రం పుంచుకుంటూ భారీ కలెక్షన్లు రాబడుతూ మేకర్స్‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘ఆరెంజ్’(Orange) రీ రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా, ‘బొమ్మరిల్లు’ భాస్కర్(Bhaskar) దర్శకత్వంOrangeలో వచ్చిన ఈ సినిమాలో జెనిలియా(Genelia) హీరోయిన్‌గా నటించగా.. అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగబాబు నిర్మించారు. ఇక ‘ఆరెంజ్’ 2010లో విడుదలైంది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ఆ చిత్రంలోని పాటలు మాత్రం ఓ ట్రెండ్‌ను సెట్ చేశాయి. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 2023లో ఈ మూవీని రీ రిలీజ్ చేయగా.. ఊహించని రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. ఇక ఆరెంజ్ స్పెషల్ షోలకు వచ్చిన డబ్బులు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ కాబోతుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed