ఒకేసారి అన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన స్టార్ హీరో.. స్పీడు తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-25 06:17:28  IST  )

టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకేసారి అన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన స్టార్ హీరో.. స్పీడు తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆ చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. తాజాగా ‘రానా నాయుడు-2’(Rana Naidu-2)తో ఓటీటీలో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు వెంకీ(Venky) యంగ్ హీరోల‌కు పోటీగా సినిమాల‌ను లైన్లో పెట్టి ఒక సంవ‌త్స‌ర కాలంలో ఏకంగా 4 సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

వాటిలో భాగంగా ముందుగా వెంకీ, మెగా 157 (mega 157)లో క్యామియో చేస్తున్నాడు. చిరూ(chiru)- అనిల్ రావిపూడి(anil ravipudi) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో వెంకీ కీల‌క పాత్ర చేయ‌నుండ‌గా, ఆ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్(trivikram) ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ ఓ సినిమా చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఆ మూవీ 2026 స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత వెంకీ జీతూ జోసెఫ్(jeethu joseph) ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే దృశ్యం3(Drishya3) రానుంది.

ఇప్ప‌టికే దృశ్యం(drishyam), దృశ్యం2(Drishya2) సినిమాల‌తో ఆడియ‌న్స్‌ను థ్రిల్ చేసిన వెంకీ, ఈసారి దృశ్యం3లో ప్రేక్ష‌కులను అల‌రించ‌డానికి అక్టోబ‌ర్‌లో రానున్న‌ట్టు తెలుస్తోంది. దృశ్యం3 త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ్లీ సంక్రాంతికి వ‌స్తున్నాం(Malli Sankranthiki Vasthunnam) సినిమాను చేసి ఆ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడు వెంకీ. మొత్తానికి 365 రోజుల్లో వెంకీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు చూస్తుంటే వెంకీ స్పీడును త‌ట్టుకోవ‌డం మిగిలిన హీరోల‌కు క‌ష్టంగా ఉంటుంది కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story