- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: అభిమానులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న సమంత కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తెలుగు హీరోలందరితో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె తెలుగు హీరోలందరితో నటించి మెప్పించింది. పలు హిట్స్ సాధించిన ఈ భామ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ స్టార్స్‌తోనూ నటించి తన నటన, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సమంత మయోసైటీస్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. చివరగా ఈ అమ్మడు ‘ఖుషి’(kushi) మూవీలో కనిపించింది. గత రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్న సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇక గత ఏడాది ఓ పాడ్ కాస్ట్ మొదలెట్టిన సామ్ నిత్యం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే అభిమానులు మాత్రం మళ్లీ ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ సినిమాను ప్రకటించింది.
కానీ దానికి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో సమంత అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈక్రమంలోనే ఆమె నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రాలాల పిక్చర్స్ సంస్థ ప్రారంభించిన ఆమె ‘శుభం’ (subham) చిత్రాన్ని నిర్మించబోతుంది. ఇక నిత్యం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల ‘శుభం’ టీజర్‌ను విడుదల చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది సమంత. తాజాగా, ఈ సినిమా రిలీజ్ ప్రకటిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘శుభం’ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది అని వెల్లడించింది. ఇక ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వంలో రాబోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
May just got Subham-fied. See you at the movies on May 9th!@TralalaPictures #Subham pic.twitter.com/pNGCQdaKOd
— Samantha (@Samanthaprabhu2) April 18, 2025






