- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ రీ రిలీజ్ కాబోతున్న రాజ్ తరుణ్ సూపర్ హిట్ మూవీ
టాలీవుడ్‌లో ప్రజెంట రీరిలీజుల(Re Release) ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రజెంట రీరిలీజుల(Re Release) ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వీటికి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ప్రతి రెండు వారాలకు ఒక పాత సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. కొందరు సందర్భాన్ని బట్టి రీ రిలీజ్ చేస్తుంటే మరికొందరు మాత్రం క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ (Raj Tharun) లైఫ్‌లో బిగ్ హిట్ ఇచ్చిన మూవీ రీ రిలీజ్ చేయనున్నారు. అదే కుమారి 21ఎఫ్ (Kumari 21F).
హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 2015లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక దీనికి డీఎస్పీ(DSP) మ్యూజిక్ అందించగా.. ఇందులోని పాటలు కుర్రాళ్లను ఊపేశాయి. అలా ఈ చిత్రం అప్పట్లో బోల్డ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలరించడానికి థియేటర్లో రీ రిలీజ్ చేయబోతున్నారట. విడుదల అయి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ మూవీను రీ రిలీజ్ చేయనున్నారు. అయితే త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.






