ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ప్రీ టీజర్..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-26 03:33:31  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ (Raaja Saab) ఒకటి.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ప్రీ టీజర్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ (Raaja Saab) ఒకటి. స్టార్ డైరెక్టర్ మారుతి(Maruthi) ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేక‌ర్స్. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జూన్ 16న టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్. తాజాగా దీనికి సంబంధించి మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు డైరెక్టర్ మారుతి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు ఉద‌యం 10.52 గంటల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుపుతూ ప్రీ టీజర్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో టీజర్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.

Video Link

Next Story