- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ సినిమాలో చాన్స్ కొట్టేసిన శోభిత!
యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobitha Dhulipala)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobitha Dhulipala)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు కొద్ది కాలంపాటు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో డేటింగ్ చేసి ఒక్కసారిగా వార్తలో సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇక వాటిని చూసిన వారంతా షాక్ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నెలలో చైతు, శోభిత పెళ్లి ఘనంగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇక అప్పటినుంచి అక్కినేని కోడలుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను ఫేక్ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.
అయితే గతంలో పలు బోల్డ్ సీన్స్‌లో చేసిన ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. అక్కినేని ఫ్యామిలీ శోభితకు కండీషన్ పెట్టినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు పాన్ ఇండియా డైరెక్టర్ పా. రంజిత్ మూవీలో శోభిత నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కిస్తున్న ‘వెట్టువన్’ చిత్రంలో అక్కినేని కోడలు కీ రోల్ చేయనున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో దినేష్(Dinesh) హీరోగా నటిస్తుండగా.. ఆర్య విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అట్టకత్తి చిత్రం తర్వాత వీరి కాంబోలో రాబోతున్న రెండు సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలను నెలకొన్నాయి. ఇక పా రంజిత్ చిత్రాల్లో హీరోయిన్లను ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. దీంతో అక్కినేని కోడలిని ఎలా చూపించనున్నాడో అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న వారంతా అక్కినేని కోడలు రేంజ్ మారిపోతుందని అంటున్నారు. ఇక పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో.. ఆమెకు లక్ కలిసిరానుందా లేదా? అనేది ఈ చిత్రంతో వెల్లడికానుందని అంతా అనుకుంటున్నారు.






