- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రజల బాగోగులు కాక్షించి బ్లాండ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను నడువుతున్న మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల బాగోగులు కాక్షించి బ్లాండ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను నడువుతున్న మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇక నుంచి ఆ సంస్థ స్వదేశంలోనే కాకుండా విదేశీ విరాళాలు కూడా స్వీకరించేందుకు అనమతిని ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల విదేశీ విరాళాలకు ఎఫ్‌సీఆర్ఏ (FCRA) పర్మీషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం-2010 కింద ఆయా ట్రస్ట్‌లు తమ పేర్లను పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. అయితే, నిబంధనల మార్పుతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కేంద్ర హోమంత్రి అమిత్ షాకు లేఖ రాయగా.. విదేశీ విరాళాలు స్వీకరించేందుకు ఆమోద ముద్ర వేశారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.






