- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gollapudi: ఆ సినిమా చేయడం నా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు.. కానీ సినిమా మాత్రం 515 రోజులు ఆడింది
గొల్లపూడి మారుతీరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా చేయడం నా ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు, కానీ సినిమా మాత్రం 515 రోజులు ఆడింది అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: గొల్లపూడి మారుతీ రావు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ లవర్స్‌కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో ఈయన ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించాడు. గొల్లపూడి మారుతీ రావుకు విలన్‌గా మంచి గుర్తింపును తీసుకువచ్చిన చిత్రాలలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొదటి స్థానంలో ఉంటుంది. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన గొల్లపూడి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
గొల్లపూడి ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంకు సంబంధించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. గొల్లపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో విలన్ పాత్ర కోసం ఎంతోమందిని అనుకున్నారు, కానీ ఆ సినిమాలో విలన్ పాత్రకు నా డైలాగ్ డెలివరీ, ఆహార్యం సెట్ అవుతుందని ఆ మూవీ బృందం వారు అనుకున్నారు, ఆ తర్వాత నన్ను సంప్రదించారు. ఇక అందులో విలనిజం అద్భుతంగా ఉంటుంది.
కానీ ఆ సినిమాలోని విలన్ పాత్ర చేయడం నా ఇంట్లో వాళ్లకు కూడా ఇష్టం లేదు, కానీ నేను చేశాను. ఇక సినిమా విడుదల అయ్యాక నా పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలయింది. ఆ చిత్రం ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ అయ్యేసరికి విలన్‌గా నాకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. అంత గొప్పగా కోడి రామకృష్ణ నా పాత్రను డిజైన్ చేశారు. ఆ చిత్రం విడుదల అయ్యాక విలన్‌గా నాకు వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలయింది. ఆ సినిమా ఏకంగా 515 రోజులు ఆడింది. ఆ సినిమా నాకు విలన్‌గా టర్నింగ్ పాయింట్" అని గొల్లపూడి చెప్పుకొచ్చారు.






