Manchu ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న Manoj..!

by Disha Web Desk 7 |
Manchu ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న Manoj..!
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్, భూమా మౌనిక కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది ప్రేమ పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే. మనోజ్‌తో పెళ్లికి ముందే మౌనికకు ఓ కొడుకు ఉన్నాడు. మరి ఈ కారణం చేతనో ఏమో తెలియదు కానీ.. వీరి పెళ్లి మంచు ఫ్యామిలీకి ఇష్టం లేదని అందుకే వారు వివాహానికి రాలేదని నెట్టింట వార్తలు వచ్చాయి. ఇక మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి వారి పెళ్లిని దగ్గరుండి చేయిచింది.

అంతే కాకుండా లాస్ట్ మినిట్‌లో మోహన్ బాబు కూడా మనోజ్ పెళ్లికి రావడంతో మౌనిక ఎమోషనల్ అయ్యారు. కానీ, విష్ణు మాత్రం వీరికి పెళ్లికి దూరంగా ఉండటంతో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీకి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మంచు మనోజ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో మనోజ్ స్పందించే వరకు వేచిచూడాల్సి ఉంది.



Next Story

Most Viewed