- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదారి గట్టుపైన: హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్రీమియర్లు ప్లాన్ చేసిన మూవీ యూనిట్
మే 7వ తేదీ రాత్రి నుండి “గోదారి గట్టుపైన” సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్‌గా రూపొందిన “గోదారి గట్టుపైన” చిత్రం విడుదలకు ముందే మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మే 7వ తేదీన హైదరాబాద్ నగరంలో భారీగా పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ప్రీమియర్ షోల సమయాలు, థియేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
రాత్రి 9:45 గంటలకు – AAA సినిమాస్, ఆర్ట్ సినిమాస్, లక్ష్మికళా
రాత్రి 10:00 గంటలకు – పీవీఆర్ ఇనార్బిట్, పీవీఆర్ నెక్సస్
రాత్రి 10:45 గంటలకు – ఏఎంబీ సినిమాస్
రాత్రి 11:00 గంటలకు – ప్రసాద్స్ మల్టీప్లెక్స్
సుబాష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభినవ్ రావు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో, ప్రీమియర్స్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.






