'గోదారి గట్టుపైన' ట్రైలర్ లాంచ్ తేదీ.. వేదిక ఖరారు

by Pulgam srinivas |

గోదారి గట్టుపైన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని AAA Cinemas స్క్రీన్–1లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

గోదారి గట్టుపైన ట్రైలర్ లాంచ్ తేదీ.. వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: మేమ్ ఫేమస్ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా కనిపించనుంది. జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను అభినవ్ రావు నిర్మించారు. ఈ సినిమాను మే 8వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన తేదీ, వేదికను ఖరారు చేసింది.

ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని AAA Cinemas స్క్రీన్–1లో నిర్వహించనున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రేపు విడుదల కాబోయే ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంటే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




Next Story