- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గోదారి గట్టుపైన’ టీజర్.. ఆహ్లాదకరంగా, ఆనందంగా సాగిపోయే కథ..
‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా హిట్ అందుకున్న సుమంత్ ప్రభాస్.. ‘గోదారి గట్టుపై’ మూవీతో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ వైబ్స్‌తో దూసుకుపోనున్నట్లు తెలిసిపోతుంది.

దిశ, సినిమా : ‘మేమ్ ఫేమస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా హిట్ అందుకున్న సుమంత్ ప్రభాస్.. ‘గోదారి గట్టుపై’ మూవీతో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ వైబ్స్‌తో దూసుకుపోనున్నట్లు తెలిసిపోతుంది. ఆస్కార్ గ్యాంగ్ అంటూ ఐదుగురు ఫ్రెండ్స్‌తో చేసే అల్లరి, క్యూట్ లవ్ స్టోరీ కలిసి సినిమా సక్సెస్‌కు ప్లస్ కానున్నట్లు అనిపిస్తోంది. మణిరత్నం, గౌతమ్ మీనన్ కూడా టచ్ చేయని కాంబినేషన్‌రా మనది, మాయ.. మ్యాజిక్.. లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓ అమ్మాయి.. అన్న, స్నేహితురాలు మధ్య జరిగే ప్రేమ ప్రయాణంలో మలుపులే ఈ ‘గోదారి గట్టు’పై కాగా షాట్ ఫిల్మ్స్ ద్వారా క్రేజ్ సంపాదించిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. జగపతి బాబు, లైలా కీలకపాత్రల్లో కనిపించనున్న మూవీని ఆసియన్ సినిమాస్ సమర్పిస్తుండగా.. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌పై అభినవ్ రావ్ నిర్మిస్తున్నాడు.






