ఆ ఓటీటీలోకి వచ్చేసిన ‘గోదారి గట్టుపైన’

by Pulgam srinivas |

‘గోదారి గట్టుపైన’ చిత్రం ఈ రోజు నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ ఓటీటీలోకి వచ్చేసిన ‘గోదారి గట్టుపైన’
X

దిశ, వెబ్ డెస్క్: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటించగా, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించారు. మంచి అంచనాల నడుమ ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకోగా, ఈ రోజు నుంచి తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాను రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మించారు.




Next Story