GOAT Teaser: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:53:09  IST  )

కొత్త హీరో సుడిగాలి సుధీర్ ( Sudheer Anand) గురించి తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో అది

GOAT Teaser: సుడిగాలి సుధీర్ కొత్త సినిమా టీజ‌ర్ వ‌చ్చేసింది
X

దిశ‌, వెబ్ డెస్క్‌: స్టార్ క‌మెడీయ‌న్‌, కొత్త హీరో సుడిగాలి సుధీర్ ( Sudheer Anand) గురించి తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో అదిరిపోయే షోలు చేసి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సుడిగాలి సుదీర్. అంతేకాదు హీరోగా అవతారం ఎత్తిన సుడిగాలి సుధీర్, వరుసగా సినిమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అటు ప‌లు షోల‌కు యాంక‌ర్ గా కూడా ప‌ని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గోట్ ( G.O.A.T) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు సుధీర్‌.

నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు లియో జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ హీరోగా చేస్తుండగా దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక గోట్ ( G.O.A.T) సినిమాకు మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ గోట్ సినిమా టీజర్ ను వదిలింది చిత్రం బృందం. ఇందులో సుదిగాలి సుధీర్ చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా గోట్ సినిమాతో క్రికెట్ నేప‌థ్యంలో రానుంది.

Next Story