- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ స్టార్ మాస్ లుక్.. చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అంటూ పోస్ట్.. బాడీ కాదు బాక్సాఫీస్ గజగజలాడాలంటూ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రజెంట్ ‘పెద్ది’(Peddi) మూవీలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రజెంట్ ‘పెద్ది’(Peddi) మూవీలో నటిస్తున్నాడు. దీనికి బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. కాగా ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ మూవీ.
ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ పోస్ట్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. తాజాగా చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ ఫొటో షేర్ చేసి.. ‘చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది.. స్వచ్ఛమైన తృణధాన్యాలు. నిజమైన ఆనందం’ అంటూ కండలు ఉన్న ఎమోజీ యాడ్ చేశాడు. ఇక ఫొటోలో చరణ్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ చేంజ్ ఓవర్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా సార్ అని బుజ్జిబాబు కామెంట్ చేయగా.. నెటిజన్లు ఈసారి బాడీ కాదు బాక్సాఫీస్ గజగజ లాడిపోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.






