Peddi: 1000 మందికి పైగా డ్యాన్సర్స్‌తో సాంగ్..రంగంలోకి జానీ మాస్టర్ !

by velandi.Saikiran |

పెద్ది సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను జానీ మాస్టర్ చేస్తున్నారట.

Peddi: 1000 మందికి పైగా డ్యాన్సర్స్‌తో సాంగ్..రంగంలోకి జానీ మాస్టర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీని ఓవైపు దున్నేస్తున్నారు రామ్ చరణ్. అయితే అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా చాలా గ్రాండ్ గా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను జానీ మాస్టర్ చేస్తున్నారట. ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన జానీ మాస్టర్ కు రామ్ చరణ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పెద్దిలో చేయబోయే ఈ సాంగ్ కోసం వెయ్యికి పైగా మంది డాన్సర్లను రంగంలోకి దింపుతున్నారట జానీ మాస్టర్. కర్ణాటకలోని మైసూర్లో ఈ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే రామ్ చరణ్, జానీ మాస్టర్, బుచ్చిబాబు అటు డాన్సర్లతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story