Ram Charan- NTR: ఆ పోటీలో జూ.ఎన్టీఆర్ పై గెలిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

by Phanindra |

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన సినిమా 'గేమ్‌ ఛేంజర్'.

Ram Charan- NTR: ఆ పోటీలో జూ.ఎన్టీఆర్ పై గెలిచిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్ : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ( Ram Charan ) హీరోగా తెరకెక్కిన సినిమా 'గేమ్‌ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో ముందుకెళ్తుంది. అయితే, ఈ క్రమంలోనే చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్‌ ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.

మిక్స్డ్ టాక్ తోనే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే, ఈ మూవీ ఫస్ట్ డే రూ. 186 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టింది. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ ఓపెనింగ్స్ తో 'గేమ్ ఛేంజర్' మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో చేరిపోయింది.

మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన అల్లు అర్జున్ 'పుష్ప 2' రూ.294 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. 'గేమ్‌ ఛేంజర్' రూ.186 కోట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' రూ. 172 కోట్లతో ఉంది. 'దేవర' కంటే 'గేమ్ ఛేంజర్' మూవీకి ఎక్కువ వసూళ్లు చేయడంతో రామ్ చరణ్ గెలిచాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story