మరోసారి థియేటర్లలోకి రామ్ చరణ్ మూవీ.. చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం..!

by Vemula.Srinu Prasad |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ లభించింది..

మరోసారి థియేటర్లలోకి రామ్ చరణ్ మూవీ.. చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం..!
X

దిశ్, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ లభించింది. ఆయన నటించిన మూవీని మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ బర్తడే సందర్భంగా క్లాసిక్ మూవీని ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. చెర్రీ నటించిన ‘ఆరెంజ్’(Orange) మూవీ గుర్తుందా. ఆ సినిమా బిగ్ హిట్ కాకపోయినా పాటల పరంగా విపరీతంగా ఆకట్టుకుంది. ఆ మూవీ పాటలు రామ్ చరణ్ కెరీర్‌లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ మూవీని మరోసారి విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 2023లోనే ఈ చిత్రాన్ని రీ రిలీజ్(Re Release) చేశారు. అప్పుడు అభిమానుల నుంచి భారీగా స్పందన వచ్చింది. డబ్బులు కూడా బాగానే వచ్చాయి.


దీంతో ‘ఆరెంజ్’ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాల రీరిలీజ్‌కు ఫ్యాన్స్ సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ నటించిన అరెంజ్ సినిమాకు కూడా మరోమారు ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.

కాగా ‘ఆరెంజ్’ సినిమా 2010 నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ జెనీలియా నటించారు. సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ మూవీకి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు. దర్శకుడు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

Next Story