మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో విలన్‌గా గ్లోబల్ బ్యూటీ.. అబ్బో జక్కన్న పెద్ద ప్లానే చేశాడుగా అంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు- రాజమౌళి సినిమాలో విలన్‌గా గ్లోబల్ బ్యూటీ.. అబ్బో జక్కన్న పెద్ద ప్లానే చేశాడుగా అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-29’అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం మన మహేష్ బాబు లాస్ట్ ఇయర్ నుంచి ఎంత కష్టపడుతున్నాడో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) కథ అందించగా.. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తోంది.

ఇటీవల రాజమౌళి ఈ మూవీ షూట్ కోసం మహేష్ పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు సింహాన్ని బోన్‌లో వేసినట్లు పెట్టిన ఓ పోస్ట్ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అయితే సినీ ప్రియులంతా ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘SSMB-29’లో విలన్‌గా మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్(Prudhvi raj Sukumaran) పేరు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అతను స్పందించి అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.

అయితే ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించనట్టుగా ఈ బ్యూటీ ఈ సినిమాలో లేడీ విలన్‌గా కనిపిస్తుందట. అంతేకాదండోయ్.. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హీరోయిన్‌గా కూడా బాలీవుడ్ బ్యూటీనే తీసుకునేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారగా.. అబ్బో జక్కన్న పెద్ద ప్లానే చేశాడుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story