- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాగితం పడవలు’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. హార్ట్ టచించ్ డైలాగ్స్‌తో మనసును కదిలించేశారుగా..
ఎంజీఆర్ తుకారాం(MGR Thukaram) దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎంజీఆర్ తుకారాం(MGR Thukaram) దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "కాగితం పడవలు'(Kagitham padavalu) అనే టైటిల్ పెట్టారు.
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ''చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్'' అనే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్‌ని తెలియజేస్తున్నాయి. తీరంలో ఓ జంట కలుసుకోవడం, విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై చాలా క్యూరియాసిటీ పెంచాయి.
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్, హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమౌతుంది. సోషల్ మీడియాలో గ్లింప్స్ వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది. గ్లింప్స్ రానున్న ప్రమోషనల్ కంటెంట్ పై చాలా మంచి అంచనాలు పెంచింది. ఈ చిత్రానికి AIS.నౌఫల్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా.. రుద్రసాయి & జానా డీవోపీగా, జెస్విన్ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎం.హిమ బిందు వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






