- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయనతార ‘మూకుతి అమ్మన్-2’ నుంచి గ్లింప్స్ రాబోతున్నాయి.. వేచి ఉండండంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మూకుతి అమ్మన్ 2’. ఇది 2020లో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ సినిమాకు సీక్వెన్స్‌లో రానున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా విడుదలైన ఈ మూవీ సీక్వెల్‌ను ‘మహాశక్తి’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుందర్.సి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, యోగి బాబు, దునియా విజయ్, ఊర్వశి, అభినయ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
అలాగే వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్, IVY ఎంటర్‌టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక దీనికి ప్రముఖ నిర్మాత డా. ఇషారి గణేష్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పవర్‌ఫుల్ కాన్సెప్ట్ – నయనతార మళ్లీ దేవతగా స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ రాబోతుందంటూ నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఇందులో భాగంగా ఎక్స్‌లో ఓ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మూకుతి అమ్మన్ 2 యొక్క మా అద్భుతమైన ప్రయాణం నుంచి ఈరోజు సాయంత్రం 5:05 గంటలకు ఆమె కీర్తికి సాక్షిగా గ్లింప్స్ రాబోతున్నాయి.. చూస్తూ ఉండండి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






