- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్డే స్పెషల్గా ‘గోపిచంద్-33’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్, బిజీఎం..
మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) గత ఏడాది ‘విశ్వం’(Viswam) సినిమాతో క్లీన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్డెస్క్: మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) గత ఏడాది ‘విశ్వం’(Viswam) సినిమాతో క్లీన్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా తర్వాత ‘ఘాజీ’(Ghazi), ‘అంతరిక్షం’(Antariksham) లాంటి వినూత్న సినిమాలు తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy) కాంబినేషన్ లో ఓ భారీ హిస్టారికల్ డ్రామా తాను చేస్తున్నారు. ఇక దీన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద చిట్టూరి శ్రీనివాసా(Chitturi Srinivasa) నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్, ఆర్ఆర్, గోపీచంద్ లుక్ చూస్తుంటే ఈ సారి గట్టిగానే హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. అలాగే ఫస్ట్ లుక్లో గోపీచంద్ డైనమిక్గా వారియర్ లుక్లో కనిపిస్తుండగా గ్లింప్స్ కూడా చాలా బాగుంది. సింపుల్ విజువల్స్ తోనే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వచ్చిన ఈ గ్లింప్స్ ఆసక్తి రేకెత్తించింది.






