51లోనూ తగ్గని గ్లామర్.. కుర్ర హీరోయిన్లను మించిపోయిన రవీనా టాండన్

by Pulgam srinivas |

51 ఏళ్ల వయసులోనూ గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తున్న రవీనా టాండన్..

51లోనూ తగ్గని గ్లామర్.. కుర్ర హీరోయిన్లను మించిపోయిన రవీనా టాండన్
X

దిశ, వెబ్ డెస్క్: రవీనా టాండన్ తెలుగు సహా పలు భాషల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న స్టార్ నటి. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బంగారు బుల్లోడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.




ఇక కొంతకాలం క్రితం యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజిఎఫ్ చాప్టర్ 2' చిత్రంలో రమికా సేన్ పాత్రలో నటించి మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ రవీనా టాండన్ తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తోంది.




సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన స్టైలిష్, గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సీనియర్ బ్యూటీ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.




కొన్ని ఫోటోల్లో ఆమె స్టైలిష్ లుక్స్, మరికొన్నింటిలో ఆకట్టుకునే పోజులతో అభిమానులను ఫిదా చేసింది. మొత్తం మీద ఈ ఫోటోల్లో రవీనా ఎంతో గ్లామరస్‌గా కనిపించడంతో నెటిజన్లు లైక్స్, కామెంట్స్‌తో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




"51 ఏళ్ల వయసులోనూ ఇంత అందాన్ని, ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయడం నిజంగా అభినందనీయం", "ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రవీనా టాండన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story