- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్.. వారికి ప్రేమను అందించాలంటూ ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి (వీడియో)
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తన నెక్ట్స్ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలనే తాపత్రయంతో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘కింగ్‌డమ్’(Kingdom) మూవీలో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రౌడీ హీరో సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న విడుదల కావాల్సి ఉండా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల మూవీ మేకర్స్ జూలై 4న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’లో కూడా నటిస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, విజయ్ దేవరకొండ కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఇక ఆయన తల్లి కోసం షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చి డిన్నర్‌కు తీసుకెళ్లాడు. ఆమె పెట్టిన మెసేజ్‌కు వెంటనే రిప్లై ఇచ్చిన విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లేందుకు మంచి హోటల్ వెతికే పనిలో పడ్డాడు. ఇక తన తల్లికి ఇండియన్ ఫుడ్ కావాలా అని అడిగి మరీ ఓ మంచి రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు.
ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మన రోజూ వారి పనులు, లక్ష్యాలు, గోల్స్ అంటూ పరుగులు పెడుతూ.. కొన్ని చిన్న చిన్న మూమెంట్స్‌ని ఫీల్, బతకడం మర్చిపోతోన్నాం.. అందుకే మేం ఇలా బయటకు వచ్చాం.. సమయాన్ని గడిపాం.. మీ మీ పేరెంట్స్‌తో ఇలా టైం గడపడం మాత్రం మర్చిపోకండి.. అప్పుడప్పుడు వాళ్లని బయటకు తీసుకు వెళ్లండి..పేరెంట్స్‌కి హగ్స్, కిస్సెస్ ఇవ్వండి.. ప్రేమను కురిపించండి.. మీకు, మీ పేరెంట్స్‌కి నా తరుపున ప్రేమను పంపిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా తల్లిదండ్రులతో ఉన్న ఫొటో షేర్ చేశాడు. అంతేకాకుండా డిన్నర్‌కు వెళ్తున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ పాటను పాడిన వీడియోను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రియల్ ఫ్యామిలీ స్టార్ అని ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.






