- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్టమనేని వారుసుడు ఎంట్రీకి ఆల్ సెట్.. క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే అంటూ పోస్ట్
దివాంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: దివాంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ డెబ్యూ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించనుండగా.. వైజయంతిపై అశ్వనీదత్, ఆనంది ఆర్ట్స్‌పై కిరణ్ నిర్మించనున్నారు. ఇందులో సారా అర్జున్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అయితే.. తాజాగా ఈ ఘట్టమనేని వారసుడు సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఘట్టమనేని జయకృష్ణ సినిమా స్క్రిప్ట్‌ను ఇప్పటికే కంపోజ్ చేయగా.. ఆకర్షనీయంగా, కూల్‌గా చాలా బాగా వచ్చిందట. అంతే కాకుండా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే ఉండనుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. మహేష్ బాబు కొడుకు కూడా ఎంట్రీ ఇచ్చేస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. Link






