- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘట్టమనేని వారసుడిపై ట్రోల్స్.. అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ అంటూ
సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

దిశ, ఫీచర్స్ : సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయ కృష్ణ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన ఫొటోలు చూసిన ఘట్టమనేని అభిమానులు మురిసిపోతుంటే.. నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ లుక్స్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. కలర్ ఉన్నా కళ లేదని కొందరు అంటుంటే.. మీకు టాలీవుడ్ సెట్ కాదు కానీ బాలీవుడ్, హాలీవుడ్‌లో ట్రై చేసుకోమని సూచిస్తున్నారు. ఏ యాంగిల్‌లో హీరోలా లేడు కానీ విలన్‌గా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతాడని మరికొందరు విమర్శిస్తుంటే.. లుక్స్‌ది ఏముంది తమిళ్, మలయాళం మూవీస్ హీరోస్ లుక్స్ లేకున్నా యాక్టింగ్‌తో ఇరగ్గొడుతున్నారుగా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యాక మంచి కంటెంట్‌తో ఎంట్రీ ఇస్తే సరిపోతుందంటున్నారు.






