Ghatikachalam : ఉత్కంఠ రేపుతున్న ఘటికాచలం ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-02 08:17:48  IST  )

నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’ (Ghatikachalam).

Ghatikachalam : ఉత్కంఠ రేపుతున్న ఘటికాచలం ట్రైలర్
X

దిశ, సినిమా: నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’ (Ghatikachalam). ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌(Suspense thriller)గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31 ‘ఘటికాచలం’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ఈ రోజు సినిమా ట్రైలర్‌(Trailer)ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.

‘డాక్టర్ కౌశిక్ సన్నాఫ్ పరుశురామ్’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైల‌ర్ చూస్తుంటే. ఒక తండ్రి తన కొడుకును డాక్టర్ చెయ్యాలని కలలు కంటాడు. కొడుకు (నిఖిల్ దేవాదుల) కూడా చాలా కష్టపడి నీట్‌లో మంచి ర్యాంక్ సొంతం చేసుకుని డాక్టర్ అవ్వడానికి వెళ్తాడు. ఇక అప్పటి నుంచి నిఖిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వీటన్నిటి ఎదుర్కొని ఫైనల్‌గా తను డాక్టర్ అవ్వగలడా లేదా అని స్టోరీ. ఇందులోని సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా, నిఖిల్ దేవాదుల నటన, ఆయన పలికిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Click For video ...

Next Story