- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఘంటసాల ది గ్రేట్’ మ్యూజికల్ కన్సర్ట్..
దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’

దిశ, సినిమా : దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అన్యుక్త్ రామ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మించారు. ఈ చిత్రంలో ఘంటసాల గారి పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించగా.. కీలక పాత్రలో సుమన్ నటించారు. ఈ మూవీని జనవరి 2న ఘనంగా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో స్వరవాహిని, శ్రీభారతి మ్యూజిక్ అకాడమీ సంయుక్తంగా ‘ఘంటసాల ది గ్రేట్.. స్పెషల్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడనిన దర్శకుడు సిహెచ్ రామారావు.. ‘‘ఘంటసాల గారి పాటల గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీని చేశాను. ఓ సారి శ్రీశ్రీ గారు ఘంటసాల వారి వద్దకు వెళ్లారు. ఆయన రాసిన పాటను ఘంటసాల గారు పాడిన తరువాత శ్రీశ్రీ గారు మంత్ర ముగ్దులయ్యారు. 'నేను ఇంత గొప్ప పాట రాశానా? అని మీరు పాడిన తరువాత అనిపిస్తోంది' అని శ్రీశ్రీ ప్రశంసించారు. అంత గొప్ప గాయకుడు ఘంటసాల. ఈ మూవీని తెలుగు ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.






