‘ఘాటీ‘ సెకెండ్ సింగిల్ అప్డేట్.. దస్సోరా వచ్చేస్తుందంటూ స్పెషల్ పోస్టర్

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి(Anushka Shetty) మనందరికీ సుపరిచితము.

‘ఘాటీ‘ సెకెండ్ సింగిల్ అప్డేట్.. దస్సోరా వచ్చేస్తుందంటూ స్పెషల్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి(Anushka Shetty) మనందరికీ సుపరిచితము. ప్రస్తుతం ఆమె 'ఘాటీ'(Ghaati) అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇక దీనికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో తమిళ నటుడు విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

కాగా ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ ఈ చిత్రం నుంచి సెకెండ్ సింగిల్ అప్డేట్ రాబోతుందంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా దస్సోరా(Dassora) సాంగ్ ఆగస్టు 20న రిలీజ్ కానుంది. ఇక పోస్టర్‌లో హీరో, హీరోయిన్ భుజాల మీద చాలా బరువు ఎత్తుకొని ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే వీరి వెనకాల చాలా దూరంలో వీరిలాగే చాలా మంది వస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Link

Next Story