Getup Srinu: 'చిరు'తో ఫ్లైట్ జర్నీ ఒక మధురానుభూతి.. ఇంట్లో వాళ్లు అలా ఫీలయ్యారు

by Pulgam srinivas |

గెటప్ శ్రీను మాట్లాడుతూ... చిరంజీవి గారితో ఫ్లైట్లో జర్నీ చేస్తున్న విషయం ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి చెప్పాను, దాంతో వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Getup Srinu: చిరుతో ఫ్లైట్ జర్నీ ఒక మధురానుభూతి.. ఇంట్లో వాళ్లు అలా ఫీలయ్యారు
X

దిశ, వెబ్ డెస్క్: ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా గెటప్ శ్రీను మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ షోలో చాలా కాలం పాటు పనిచేసిన ఈయన ఎంతోమంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈ నటుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనేక చిత్రాల్లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజాగా శ్రీను, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా శ్రీను ఈ ఫోటో గురించి స్పందిస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా చిన్నతనంలో ఊర్లో ఆకాశం నుండి విమానం వెళ్తుందంటే చాలు చిరంజీవి అందులో వెళ్తున్నాడని చిరంజీవి, చిరంజీవి అని అరిచేవాళ్ళం.

అలాంటి నేను చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి గారితో కలిసి ఫ్లైట్లో జర్నీ చేశాను. ఇదే విషయాన్ని మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. నేను ఈ విషయం చెప్పి ఎమోషనల్ కావడంతో వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఆ రోజు చాలు, ఇక మనం హైదరాబాద్ వచ్చిన పని అయిపోయింది అని అనుకున్నట్లు శ్రీను చెప్పుకొచ్చాడు. ఈయన చిరంజీవితో కూడా పలు చిత్రాల్లో నటించాడు. తాజాగా ఈ నటుడు సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా నిహారిక నిర్మాణంలో రూపొందిన రాకాస చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

Next Story