నయనతారతో ఆ పని చేయించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-12-09 15:40:29  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

నయనతారతో ఆ పని చేయించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్‌ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘మన శంకర వరప్రసాద్ మూవీను చిరంజీవి గారు ఒప్పుకోవడం, ఆ మూవీ ఓపెనింగ్ ఒక బ్యాంగ్.. దాన్నే నయనతార కూడా ఫాలో అయ్యారు. బేసిక్‌గా నయనతార ప్రమోషన్స్ కే రారు! "వీడేలా ప్రమోషన్స్ చేయించాడు" అని టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అప్పుడు. అయితే నేను చేసిందేమీ లేదు! నయనతార గారితో పాజిటివ్ గా వెళ్ళాను.. ఆవిడకు ఐడియా చెప్పాను.. ఆమె చేసేసారు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

Click For Tweet .....

Next Story