ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావడం చాలా అరుదు: మిథిలా పాల్కర్

by Mallepaka Hamsa |

అనుకున్నంతగా మంచి ఆఫర్లు రావడం లేదని ఆమె ఓపెన్‌గా చెప్పేశారు. అవకాశాలు వస్తున్నప్పటికీ.. అవన్నీ మనసుకు నచ్చేలా, తాను చేయాలనుకునే కథల్లా ఉండట్లేదని తెలిపారు.

ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావడం చాలా అరుదు: మిథిలా పాల్కర్
X

దిశ, సినిమా: డిజిటల్ కంటెంట్, వెబ్ సిరీస్‌ల ద్వారా నటి మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘భూత్ బంగ్లా’ మూవీలో కీలక పాత్రలో నటించిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన చేతిలో ఏ ప్రాజెక్ట్ లేకపోవడంతో పలు ఇంటర్వ్యూ్ల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు వస్తున్న ఆఫర్లు, సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో తనకు నచ్చిన కథలను ఎంచుకునే అవకాశం రావడం వెనుక ఉన్న అసలు విషయాలను పంచుకున్నారు. అనుకున్నంతగా మంచి ఆఫర్లు రావడం లేదని ఆమె ఓపెన్‌గా చెప్పేశారు. అవకాశాలు వస్తున్నప్పటికీ.. అవన్నీ మనసుకు నచ్చేలా, తాను చేయాలనుకునే కథల్లా ఉండట్లేదని తెలిపారు.

ఇండస్ట్రీలో నిజంగా నచ్చే, మంచి ఆఫర్లు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని.. అయితే, ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ.. ఒక మంచి పొజిషన్‌లో ఉండటం తన అదృష్టమని మిథిలా చెప్పుకొచ్చారు. అలాగే ట్రోల్స్, నెగిటివిటీ గురించి మాట్లాడుతూ.. కాలంతో పాటు తనకు ఒక మంచి అభిమానుల గ్రూప్ ఏర్పడిందని, అందుకు తాను ఎంతో రుణపడి ఉంటానని మిథిలా తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా తనపై తప్పుడు కామెంట్స్ పెట్టినా, హేట్ కామెంట్స్ చేసినా.. తన ఫ్యాన్స్ అందరూ గ్రూప్‌గా వచ్చి వాళ్లకు గట్టిగా సమాధానం ఇస్తారని చెప్పారు. ఆ సమయంలో తాను ఏమీ చేయాల్సిన అవసరం ఉండదని, తన తరఫున అభిమానులే మాట్లాడతారని.. వారి ప్రేమ చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుందని మిథిలా పాల్కర్ ఎమోషనల్ అయ్యారు.

Next Story