Varun Dhawan: గెట్ రెడీ వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఫైరింగ్ పోస్టర్ రిలీజ్

by Hamsa |
Varun Dhawan: గెట్ రెడీ వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఫైరింగ్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’. ఈ చిత్రాన్ని కలీస్ (Kalis)దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh), వరుణ్ సరసన నటిస్తుంది. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కామియో రోల్‌లో కనిపించబోతున్నాడు. దీనిని మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ(Priya Atlee), జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బేబీ జాన్’(Baby John) మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. ‘బేబీ జాన్’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇటీవల ‘పికిలీ పామ్’ అనే సాంగ్ విడుదల చేయగా.. మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. తాజాగా, ‘బేబీ జాన్’ మూవీ ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

డిసెంబర్ 9న ట్రైలర్ రాబోతున్నట్లు తెలుపుతూ వరుణ్ ధావన్(Varun Dhawan) కూర్చుని కోపంగా చూస్తుండగా.. వెనకాల దేవుడి బొమ్మలు మంటలు వస్తున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి అంచనాలను రెట్టింపు చేశారు. అంతేకాకుండా.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెట్ రెడీ ‘బేబీ జాన్’ యాక్షన్ మోడ్‌లో ఉన్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఫైరింగ్ ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

Next Story