వేటకు సిద్ధమవ్వండి.. ‘కాటాలన్’ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

దుషారా విజయన్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే లుక్‌ను విడుదల చేసింది. ఈచిత్రంలో ఆమె ‘లూసీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

వేటకు సిద్ధమవ్వండి.. ‘కాటాలన్’ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ దుషారా విజయన్, ఇప్పుడు ‘కాటాలన్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. మలయాళ యాక్షన్ స్టార్ ఆంటోని వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా.. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్, అజనీష్ లోక్‌నాథ్ వంటి దిగ్గజ సంగీత దర్శకులు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఈ మూవీలో టాలీవుడ్ నటుడు సునీల్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం, తాజాగా దుషారా విజయన్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే లుక్‌ను విడుదల చేసింది. ఈచిత్రంలో ఆమె ‘లూసీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. విడుదలైన పోస్టర్‌లో దుషారా చేతిలో గన్ పట్టుకుని, శత్రువులపై గురిపెట్టి, ఎంతో ఆగ్రహంతో లుక్‌తో కనిపిస్తోంది. ఈ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ దుషారా విజయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వేటకు సిద్ధమవ్వండి’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను కూడా జత చేసింది. ఈ లుక్, క్యాప్షన్ చూస్తుంటే.. సినిమాలో హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, హీరోతో సమానంగా యాక్షన్ సీన్లలో అదరగొట్టబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది.

Next Story