- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస సర్‌ప్రైజుల కోసం సిద్ధంగా ఉండండి.. ‘సూపర్ హీరో బాబు’పై హైప్ పెంచిన మూవీ మేకర్స్
ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటే చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.

దిశ, సినిమా: విలక్షణమైన వాయిస్, తన అద్భుతమైన నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అర్జున్ దాస్. ఇటీవల ‘కాన్ సిటీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ అర్జున్ దాస్ ఏమాత్రం నిరాశ చెందకుండా వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు. తాజాగా, తన కొత్తప్రాజెక్ట్ ‘సూపర్ హీరో బాబు’ అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటే చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. సాధారణంగా ఏ సినిమాకైనా ఒకే ఒక్క ఫస్ట్ లుక్ విడుదల చేయడం అలవాటు. కానీ ‘సూపర్ హీరో బాబు’ సినిమా కోసం వరుసగా మూడు లుక్స్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మొదటి లుక్ జూలై 6న విడుదల కాబోతోంది. ఆ తర్వాత జూలై 8న సెకండ్ లుక్, జూలై 10న థర్డ్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా "ప్రతి సర్‌ప్రైజ్‌కి దానికి తగిన ఒక ప్రత్యేక క్షణం ఉంటుంది" అంటూ చిత్ర బృందం క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. దర్శకుడు విఘ్నేష్ వేణుగోపాల్ తెరకెక్కిస్తుండగా.. అర్జున్ దాస్ సరసన తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తోంది.






