- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెట్ రెడీ బాయ్స్.. ‘రెట్రో నుంచి బిగ్ అప్డేట్ వచ్చేస్తుందంటూ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(surya) ఇటీవల ‘కంగువా’ సినిమాతో వచ్చాడు అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(surya) ఇటీవల ‘కంగువా’ సినిమాతో వచ్చాడు అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో(retro). ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు(karthik subbaraju) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(pooja hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక(jyothika), సూర్య నిర్మిస్తున్నారు. అయితే దీనికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘రెట్రో’ మూవీ మే 1వ తేదీన థియేటర్స్‌లోకి రానుంది.
అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులతో పాటు సూర్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘రెట్రో’నుంచి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ ‘కనిమా’ సాంగ్ మార్చి 21న రాబోతున్నట్లు తెలుపుతూ సూర్య పోస్టర్‌ను షేర్ చేశారు. మా బాయ్స్ అంబనా ఫ్యాన్స్ కోసం రెట్రో అప్డేట్ వచ్చేస్తుందని కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశారు. ఇక సూర్య పోస్టర్ విషయానికొస్తే.. ఇందులో ఆయన వైట్ సూట్ ధరించి పైకి చేతులు లేపి స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం సూర్య పోస్టర్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.






