ఆ హీరోయిన్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by Sujitha Rachapalli |

రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. ఇప్పటికే ఈ సినిమా నుంచి యశ్, కియారా, హ్యూమా ఖురేషి, నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా తాజాగా తారా సుతారియా లుక్ విడుదల చేశారు మేకర్స్.

ఆ హీరోయిన్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. ఇప్పటికే ఈ సినిమా నుంచి యశ్, కియారా, హ్యూమా ఖురేషి, నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ కాగా తాజాగా తారా సుతారియా లుక్ విడుదల చేశారు మేకర్స్. అందమైన, ఆకర్షణీయమైన, సున్నితమైన పాత్రలో కనిపించబోతున్న రెబెకాగా తన పాత్రను పరిచయం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చిత్ర ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్.. ‘తారా స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు క‌లిగిన వ్య‌క్తి. అదే ఆమెకు ర‌క్ష‌ణ. న‌టిగా ఆమెకు ఆమెకు కావాల్సినంత స్వేచ్చ‌ ఇస్తే చాలు.. అద్భుతాలు చేస్తుంది. ఈ పాత్ర‌లో అద్భుతంగా జీవించింది. నటనతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మీ అంద‌రినీ కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంద‌న‌డంలో సందేహం లేదు’’ అని తెలిపింది. కాగా ఈ సినిమా మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Next Story