Geetha Madhuri: షాకింగ్ పోస్ట్ పెట్టిన గీతా మాధురి.. తోటి సింగర్‌ను అలా అనడమేంటని నెటిజన్లు ఫైర్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి(Geetha Madhuri) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో మాస్ సాంగ్ పాడి తన గొంతుతో అందరినీ మెప్పించింది.

Geetha Madhuri: షాకింగ్ పోస్ట్ పెట్టిన గీతా మాధురి.. తోటి సింగర్‌ను అలా అనడమేంటని నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి(Geetha Madhuri) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఎన్నో మాస్ సాంగ్ పాడి తన గొంతుతో అందరినీ మెప్పించింది. చిరుతకు ముందు ఆమె కొన్ని సినిమాలు పాడినప్పటికీ, చిరుతలోని చంకా చంకా పాటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ పాల్గొని తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడి అందరినీ ఫిదా చేసింది. అంతేకాకుండా ఉత్తమ నేపథ్య గాయనిగా పలు అవార్డ్స్ కూడా పొందింది. అంతేకాకుండా స్టార్ సింగర్‌గా కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో రాణించింది.

ఇక వరుస అవకాశాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే గీతా మాధురి టాలీవుడ్ నటుడు నందు(Nandu)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల గీతా, నందు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రాగా.. దానికి ఈ జంట స్పందించి అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నందు సినిమాలు చేస్తుండగా.. గీతా మాధురి మాత్రం తన పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, గీతా మాధురి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్(Neha Kakkar) కూడా నాకు నచ్చుతుంది. కానీ నన్ను సమాజం ఒప్పుకుంటుందా?’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తోటి సింగర్‌ను అలా అనడమేంటని ఫైర్ అవుతున్నారు. అయితే నేహా కక్కర్‌కు సోషల్ మీడియాలో కాస్త నెగెటివిటీ ఉంటుంది. తను జడ్జ్‌గా వ్యవహరించే షోల్లో వచ్చే సింగర్లకు ఉన్నంత టాలెంట్ కూడా నేహా కక్కర్‌కి ఉండదని అంతా ట్రోలింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే గీతా ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

Next Story