- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గీతా ఆర్ట్స్‌తో ప్రభాస్ నెక్స్ట్.. బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్!
రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, స్టార్స్ ఆయనకు సోషల్ మీడియా వేధికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సైతం ప్రభాస్‌కు మ్యాష్

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, స్టార్స్ ఆయనకు సోషల్ మీడియా వేధికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సైతం ప్రభాస్‌కు మ్యాష్ అప్ వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చింది. వీడియోలో ప్రభాస్ చేసిన సినిమాల క్లిప్స్ యాడ్ చేసి బ్యాగ్రౌండ్లో అదిరిపోయే డైలాగ్స్ యాడ్ చేసింది. అర్జునుడి లాంటి రూపం.. భీముడి లాంటి బలం అంటూ సాగే వీడియో చూడ్డానికి ఎంతో ఆకట్టుకునే విధంగా పవర్ ఫుల్‌గా ఉంది.
దీంతో వీడియో చూసిన అభిమానులు కుషీ అవుతున్నారు. అంతే కాకుండా గీత ఆర్ట్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది అంటే ప్రభాస్ తో ఏదైనా ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యిందా అని అనుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బర్త్ డే బాయ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు సలార్ 2, ప్రభాస్ హనురాగవపూడి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పై ఉన్నాయి. VIDEO
READ MORE ...






